సంక్రాంతి పండుగ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు శుక్రవారం డిఈఓ రామారావును కోరారు. మచిలీపట్నంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10వ తారీఖు నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరిగిందని, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.