మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు తాళం వేసిన టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని క్రైస్తవులు కోరారు. శనివారం మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు వినతిపత్రం అందజేశారు. మరణ ధ్రువీకరణ పత్రం పుస్తకం, రికార్డులను తన వద్దనే ఉంచుకొని, క్రైస్తవులు పవిత్రంగా భావించే స్మశాన వాటికలో పెంపుడు గేదెలు పెంచుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేశారు.