అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు.