బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని రాష్ట్ర మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీతో కలిసి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించి, అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందించారని గుర్తు చేసుకున్నారు.