అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కల్పించారు. అధికారులు, సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన చర్యలు, పాటించవలసిన నియమాలు ప్రజలకు వివరించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రోజు మొదటి రోజు కావడంతో తొలుత పట్టణంలో ర్యాలీని నిర్వహించారు.