మచిలీపట్నం: పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులిద్దరూ రావాలి

0చూసినవారు
కృష్ణాజిల్లాలో ఈనెల 10వ తేదీన జరిగే పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులిద్దరూ పాఠశాలలకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీ. కే. బాలాజీ కోరారు. శనివారం మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేరెంట్స్ మీటింగ్ ను నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థుల పురోభివృద్ధికి ఉపాధ్యాయుల సూచనలు, తల్లిదండ్రుల బాధ్యత గురించి కూడా వివరించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్