మచిలీపట్నంలోని బలరాంపేట శివారు మట్టవారి వీధిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అల్లూరి శ్రీనివాస్ కుటుంబం హైదరాబాద్ వెళ్లగా, ఐదు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. గమనించిన దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. తలుపులు తెరిచి ఉన్న విషయం సోమవారం స్థానికులు గమనించి బాధిత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఆర్ పేట పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.