మచిలీపట్నం: అవగాహనతో క్యాన్సర్ దూరం

67చూసినవారు
మచిలీపట్నం: అవగాహనతో క్యాన్సర్ దూరం
క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధి దూరమవుతుందని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి శర్మిష్ట పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆమె ఊపి ర్యాలీని ప్రారంభించారు. చాలామంది అవగాహన లేక వ్యాధి బారిన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్