శాంతి భద్రతల పరిరక్షణ, సిసిటివి కెమెరాల ఏర్పాటు వంటి వివిధ విభాగాలలో అత్యుత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు శుక్రవారం రాత్రి నగదు రివార్డులు అందజేసి వారిని అభినందించారు. విధి నిర్వహణలో సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, ప్రజలపై ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా ఈ రివార్డులను అందజేయడం జరిగిందని మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ తెలిపారు.