రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో సుపరిపాలనకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికాలం అయిన సందర్భంగా గురువారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.