మచిలీపట్నం: మొహరం సందర్భంగా చెస్ట్ బీటింగ్

190చూసినవారు
మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో ప్రతి ఏడాది లాగానే మొహరం సందర్భంగా ముస్లిం సోదరులు చెస్ట్ బీటింగ్ ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొహరం సంతాప దినాలను పురస్కరించుకుని ముస్లిం సోదరులు సెంటర్లో బ్లేడ్లతో ఛాతిపై గాయపరచుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అనంతరం స్థానిక మసీదులో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని దాతలను మంత్రి అభినందించారు.

సంబంధిత పోస్ట్