పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయం వద్ద 19 మందికి రూ. 16. 68 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 125 మందికి రూ. 1, 81, 71, 780 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్ధిక తోడ్పాటు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.