ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేసినందుకు విద్యాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో అభినందించారు. రానున్న సంవత్సరంలో కూడా ఇలాగే మరింత మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసేలా ఈ ఫలితాలు వచ్చాయని తెలిపారు.