మచిలీపట్నం నగరంలో ఇంటింటికి వెళ్లి మున్సిపల్ సిబ్బంది తడి, పొడి చెత్త సేకరిస్తున్న పని తీరును జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ పాత రామన్నపేటలో పర్యటించి పలుచోట్ల తడి, పొడి చెత్త వేరు చేయకుండా ఒకే డస్ట్ బిన్ లో వేయడాన్ని చూసి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నివాసితులతో తడి, పొడి చెత్త వేరువేరుగా చేయించారు.