జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మచిలీపట్నంలో ఎన్నికల నిర్వహణపై జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇరిగేషన్ ఏఈలతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 204 సాగునీటి సంఘాలు, 27 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయన్నారు.