మచిలీపట్నం మండలం కోన కృష్ణ యూనివర్సిటీ రోడ్ లో శారద నగర్ రంగనాయకమ్మ పేటకు చెందిన గ్రామస్థులు మంగళవారం ధర్నా దిగారు. స్మశానం విషయంలో నెలకొన్న సమస్యను తొలగించాలంటూ ఆందోళన దిగారు. దీంతో యూనివర్సిటీకి వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలు వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. భారీగా జనం ఆందోళన చేయటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.