కృష్ణా విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహం నిర్మాణ పనులు శేరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు ను ఉపకులపతి ఆచార్య కె. రాంజీ శనివారం పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురాలని, ఆ దిశగా పనులు చేపట్టాలని రాంజీ ఆదేశించారు. 14. 62 కోట్లతో జి ప్లస్ వన్ భవనం నిర్మిస్తున్నారు. సుమారు 300 మంది బాలికలకు వసతి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా భవనానికి రూపకల్పన చేశారు.