బ్యాలెట్ పేపర్ల ద్వారా దేశంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ బుధవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ పూర్తి వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మత ప్రచారకుడు డా. కె. ఏ. పాల్ దాఖలు చేసిన వ్యాజాన్ని డివిజన్ బెంచ్ కొట్టివేసినట్టు వెల్లడించారు