మచిలీపట్నంలోని భాస్కరపురం వినాయకుని గుడి సమీపంలో (నోబుల్ రోడ్డు) చీకటిలో రోడ్డుపై నిలిచి ఉన్న గేదెను శనివారం సాయంత్రం ఆటో బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన స్థలంలోనే ఆ మూగ ప్రాణి మృతి చెందింది. రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు కావడంతో ఈ ప్రాంతంలో వాహనాలు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పాడి పశువు సుమారు లక్ష రూపాయల వరకు ఉంటాయని, పాడిపై ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని పశు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.