జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ చైర్మన్ మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖమాత్యులు నాదెండ్ల మనోహర్ ను కృష్ణా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఆదివారం తెనాలి వారి నివాసంలో కలిశారు. ఈనెల 18వ తేదీన జరగబోవు పదవి బాధ్యత స్వీకరణ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను మంత్రికి అందించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ బండి రామకృష్ణను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రైతులకు సేవ చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారని అన్నారు.