సీసీటీవీ కెమెరాలపై దృష్టి పెట్టి అరగంటలో దొంగలను పట్టుకోవడంలో టెక్నాలజీ అభివృద్ధిలోకి తీసుకొస్తామని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అన్నారు. గురువారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజల రక్షణ దృష్ట్యా ప్రజలకు త్వరలో సరికొత్త విధానాన్ని తీసుకొస్తానని తెలిపారు. యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్ గుర్తించి తగు చర్యలు చేపడతామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు.