మచిలీపట్నంలో జరుగుతున్న యువ కెరటాలు ముగింపు కార్యక్రమంలో సినీ సందడి నెలకొంది. 'క' సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం నటించిన 'దిల్ రూబా' సినిమా ట్రీజర్ ను యువకెరటాలు వేదిక మీద మంత్రి కొల్లు రవీంద్ర శనివారం విడుదల చేశారు. అలాగే 'సీత ప్రయాణం కృష్ణతో' సినిమా ప్రమోషన్ ని కూడా ఈ వేదిక మీద నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మచిలీపట్నం యువత చేతుల మీదుగా విడుదల చేశారు.