కృష్ణా జిల్లా పోలీస్ అధికారి ఆర్. గంగాధర రావు సోమవారం రాత్రి మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ - 2025 ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. "పోలీస్ డైరీ" పోలీసు శాఖకు ఎంతో అవసరమైన ప్రాముఖ్యత కలిగిన మార్గదర్శక గ్రంథమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది తమ రోజువారీ విధుల నిర్వహణ ఉంటుందని తెలిపారు.