రక్తదానం చేసి పలువురి ప్రాణాలను కాపాడాలని ఆసుపత్రి సూపర్డెంట్ ఆశాలత యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవంను పురస్కరించుకొని శుక్రవారం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వ్యాప్తంగా రక్తదానం అధిక సార్లు చేసిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రజలు రక్తదానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అపోహలను తొలగించుకోవాలని కోరారు.