మచిలీపట్నం బీజేపీ 1వ మండల అధ్యక్షుడిగా పుప్పాల హరి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మచిలీపట్నంలోని బీజేపీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించగా హరి రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా చిరువోలు బుచ్చిరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగనాథ్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, శంకరయ్య, వైవీఆర్ పాండురంగారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.