ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గన్నవరంలో జరిగిన దాడి కేసులో 8 మంది వైసీపీ కార్యకర్తలపై తప్పుడు సెక్షన్లు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.