మచిలీపట్నం: పేర్ని నానిని అరెస్ట్ భయం వెంటాడుతోంది
By A.R. Prasad 82చూసినవారుఅరెస్ట్ భయంతో పేర్నినాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శుక్రవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోవడానికి నాని పడరాని పాట్లు పడ్డారని, నకిలీ పట్టాలు సృష్టించారన్నారు. తహసీల్దార్ ఆఫీసులో నకిలీ పట్టాలు రాస్తుంటే తాము పట్టుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2023లో బదిలీ అయిన తహశీల్దార్ 2024 పట్టాలిచ్చినట్లు నాని చెప్పారన్నారు.