జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందని నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లో గృహ నిర్మాణంపై క్షేత్రాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10,007 ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,603 ఇల్లు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గీతాంజలి శర్మ పాల్గొన్నారు.