మచిలీపట్నం: ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది

95చూసినవారు
సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం రాత్రి మచిలీపట్నంలోని 12వ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాలు పొందిన లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్