సాధారణ బదిలీల్లో భాగంగా ఈరోజు గుడివాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హనీష్ జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావును మర్యాదపూర్వకంగా శనివారం రాత్రి కలిసి మొక్కను అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ కి ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు మరింత బాధ్యతను పెంచుతాయని శాంతిభద్రతల పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తూ, సిబ్బంది సంక్షేమానికి విశిష్ట కృషి చేయాలన్నారు.