హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు కృష్ణాజిల్లా ప్రజలందరికీ శనివారం ఉదయం ఒక ప్రకటనలో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను కుటుంబ సభ్యులందరి సమక్షంలో సంతోషంగా, శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తెలియజేశారు. ఆలయాల వద్ద భక్తిప్రపత్తులతో స్వామివారికి పూజలు నిర్వహించాలని సూచించారు. సమైక్యతతో హనుమాన్ జయంతిని నిర్వహించుకోవాలన్నారు.