మచిలీపట్నం నగరంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారి వర్షం మొదలై భారీగా గాలులు వీచాయి. కోనేరు ప్రధాన సెంటర్ లో నీరు భారీగా నిలిచి ఉండగా, తెల్లవారుజామున ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ప్రధాన రహదారి పక్కల వర్షపు నీరు నిలవటంతో ప్రజలు, వాహన దారులు అవస్థలు పడుతున్నారు. పలు పల్లపు ప్రాంతాలు జలమయమాయ్యాయి.