మత్స్యకారుని కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మచిలీపట్నం నియోజకవర్గం తాళ్లపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయిన ఏడుకొండలు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి ఒకటో తేదీన ఏడుకొండలు గల్లంతయ్యడని, అతని చూకీ కోసం వెతుకుతున్న దొరకలేదన్నారు.