దేశ ప్రజలందరికీ ఆదర్శనీయులు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) అన్నారు. సోమవారం మచిలీపట్నం నగరంలోని శారద నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.