ఏలూరు రేంజ్ ఐజీపీ జి. వి. జి. అశోక్ కుమార్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, ఇతర పోలీసు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా చేపడుతున్న చర్యల గురించి ఎస్పీ ఐజీపీకి వివరించారు.