వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా అక్రమ బెల్ట్ షాపులు నిర్వహించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ లిక్కర్ కేసులో సిట్ విచారణ చేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించడం జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి నాని లేనిపోని ఆరోపణలు చేయవద్దన్నారు.