మచిలీపట్నం-బీదర్ ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని సీపీఎం మచిలీపట్నం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శనివారం మచిలీపట్నంలో రైల్వే స్టేషన్ మాస్టార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కోరారు.