మచిలీపట్నంలో త్వరలో జరగనున్న మసులా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పరిశీలించారు. కూటమి నాయకులు, అధికారులతో కలిసి బీచ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.