ఐఏఎస్ గా( ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీని నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం శనివారం రాత్రి ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పేద ప్రజల పట్ల చూపుతున్న దయాగుణం గురించి కొనియాడారు.