హ్యుమానిటీ ఫౌండేషన్, రోటరీ క్లబ్ వారు కలసి సంయుక్తంగా నిరుపేద విద్యార్థికి ల్యాప్ టాప్ ను ఆదివారం అందించారు. పెడన నియోజకవర్గం ఆకులమన్నాడుకు చెందిన అబ్దుల్ ఇమ్రాన్ అనే విద్యార్థి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో బీ. టెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఆర్ధిక పరిస్థితి గమనించి గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ చైర్మన్ బాపిరాజు చేతుల మీదుగా ల్యాప్ టాప్ ను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.