మచిలీపట్నం డీ-మార్ట్ లో ఉన్న డ్రైనేజీ గ్రిల్స్ లో యువకుడి కాలు ఇరుక్కుపోయిన నరకయాతన అనుభవించాడు. మంగళవారం రాత్రి సరుకులు కొనుగోలు చేసేందుకు మచిలీపట్నంకు చెందిన యువకుడు మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో చూడకుండా వెళుతుండగా, డ్రైనేజీ గ్రిల్స్ లోకి కాలు ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మిషన్ సహాయంతో దాన్ని కట్ చేసి కాలు జాగ్రత్తగా బయటకు తీశారు.