మచిలీపట్నంలో శ్రీ జగన్నాధ స్వామి వారి రథయాత్రను శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక చాకిరేవుపాలెంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి మందిరం నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర నగర ప్రధాన వీధుల్లో కన్నుల పండువగా సాగింది. నిజాంపేటలో వేంచేసియున్న శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు