మచిలీపట్నం మండలం గంటలంపాలెంకు చెందిన అమ్మిరెడ్డి శ్రావణ్ అనే యువకుడు పందికొక్కుల నిర్మూలనకు ఉపయోగించే మందు బిళ్ళలు తిని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు