మచిలీపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నేతలు గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్ చిన్నారులచే అక్షరాభ్యాసం నిర్వహించారు. అక్షర జ్ఞానం ఉంటే సమాజంలో ఎలాగైనా బ్రతకవచ్చునని నేతలు తెలిపారు. తొలుత సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.