రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో ఎల్. ఎం. ఎల్ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఎండీ & సీఈవో డా. యోగేష్ భాటియా మంగళవారం సమావేశమయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో ఎల్. ఎం. ఎల్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటు గురించి చర్చించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వర్యులతో కూడా సమావేశమై ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం చేసుకునేలా చర్యలు తీసుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.