మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో గ్రామంలో ఉన్న మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ ను గురువారం మైన్స్ అధికారులు పరిశీలించారు. గోడౌన్ నిర్మాణ సమయంలో ఎటువంటి సీనరేజ్ చెల్లించకుండా బుసక తోలి మెరక చేశారని మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నెంబర్ 89/2, 92/1లలో 60వేల క్యూబిక్ మీటర్ల బుసకను గోడౌన్ స్థలం మెరకకు వినియోగించారని ఫిర్యాదు వచ్చినట్టు అధికారులు తెలిపారు.