హనుమాన్ జయంతి సందర్భంగా మచిలీపట్నం సుల్తానగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉదయాన్నే స్వామివారికి హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి మంత్రి పేరిట పూజలు చేశారు. పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.