మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పర్యటించారు. పట్టణంలోని కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ మరమ్మతు పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని 41వ డివిజన్లో పలువురిని పరామర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.