ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబర్ నెలకు సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ప్రారంభించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి నారాయణపురంలో పర్యటించిన మంత్రి రవీంద్ర పలువురి పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.