మొహరం దుఃఖ దినాల్లో భాగంగా 10వ రోజు సందర్భంగా శనివారం మచిలీపట్నం బారా ఇమామ్ పంజా సెంటర్ నుంచి పీర్ల ఊరేగింపు నిర్వహించబడింది. ఈ ఊరేగింపులో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఊరేగింపులో పాల్గొని పీర్లకు దట్టి సమర్పించడం జరిగింది. గత పది రోజులుగా ముస్లిం సోదరులు రాత్రివేళ పీర్లను భక్తిప్రపత్తులతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.